ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా బీజేపీ గెలిచే అవకాశముందని చూపిస్తున్నాయి. అయితే, గతంలో ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని పక్కాగా అంచనా వేసిన కేకే సర్వే, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలపై విభిన్న అంచనా వేసింది.
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందని వెల్లడించింది.
ఈ సర్వే ప్రకారం, ఆప్ 39 స్థానాలను గెలుచుకుంటుందని, బీజేపీ 22 స్థానాలతో పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇది ఇప్పటికే వెల్లడైన అనేక ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
బీజేపీకి ఆశించిన విజయం దక్కదని, ఆప్ మరోసారి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని కేకే సర్వే స్పష్టం చేసింది.
కేకే సర్వే గతంలో కూడా రాజకీయ ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన నేపథ్యంలో, ఈ సారి కూడా అదే జరుగుతుందా? లేక ఇతర ఎగ్జిట్ పోల్స్ లాగే బీజేపీ గెలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.