fbpx
Saturday, December 28, 2024
HomeInternationalకోల్కత్తా చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్!

కోల్కత్తా చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్!

KKR-BROKE-DELHI-WINNING-SERIES-BY-BEATING-WITH-2WICKETS

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాలకు కోల్కత్తా నైట్ రైడర్స్‌ అడ్డుకట్ట వేసింది. ఢిల్లీ నిర్ధేశించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించి, ఢిల్లీ విజయ పరంపరకు బ్రేక్ వేసింది. కేకేఆర్ స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్మెన్‌ నితీశ్‌ రాణా(27 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో చివరి దాకా ఉండి గెలిపించాడు.

20 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో నరైన్‌, నాలుగు పరుగుల తర్వాత సౌథీ(3) ఔటైనా నితీశ్ రాణా మాత్రం ఒత్తిడికి లోను కాకుండా బౌండరీ కొట్టి తమ జట్టు‌ను గెలిపించాడు. దీంతో కేకేఆర్‌ 2 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ 3 వికెట్లు, నోర్జే, అశ్విన్‌, లలిత్‌ యాదవ్‌, రబాడా తలో వికెట్‌ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్‌ వికెట్లు త్వరత్వరగానే కోల్పోయింది. రబాడా వేసిన 11వ ఓవర్‌ ఆఖరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ క్యాచ్‌ పట్టడంతో శుభ్‌మన్‌ గిల్‌(33 బంతుల్లో 30; ఫోర్‌, 2 సిక్సర్లు) ఔట్‌ కాగా.. అదే స్కోర్‌ వద్ద ఆ మరుసటి ఓవర్‌ రెండో బంతికి అశ్విన్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ డకౌటయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular