స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఒక అరుదైన ఘనతను సాధించింది. గురువారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో గెలవడం ద్వారా ఈ మైలురాయిని అధిగమించింది.
ఈ విజయంతో మూడు విభిన్న జట్లపై 20కి పైగా విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
ఇప్పటివరకు కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 20 విజయాలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 20 విజయాలు, పంజాబ్ కింగ్స్‌పై 21 విజయాలను నమోదు చేసింది. ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో తెగ సెలబ్రేట్ చేస్తున్నారు.
2023 నుంచి 2025 మధ్య కాలంలో సన్‌రైజర్స్‌తో జరిగిన వరుస ఐదు మ్యాచ్‌లలో కూడా కేకేఆర్ గెలవడం గమనార్హం. గతంలో ఇదే ఫీట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2020-23 మధ్య ఎస్ఆర్హెచ్‌పై సాధించింది.
గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 200 పరుగుల భారీ స్కోరు చేసి, హైదరాబాద్‌ను కేవలం 120 పరుగులకే ఆల్‌అవుట్ చేసింది. ఈ ఓటమి ఎస్ఆర్హెచ్‌కు రన్స్ పరంగా ఐపీఎల్ చరిత్రలోనే రెండవ భారీ పరాజయం కావడం విశేషం.
కేకేఆర్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించగా, వెంకటేశ్ అయ్యర్ 60, రహానే 38, రఘువంశీ 50 పరుగులతో కట్టుదిట్టమైన ప్రదర్శన ఇచ్చారు. బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి మెరిపించారు.
ఈ విజయంతో కోల్‌కతా పాయింట్ల పట్టికలో మరో మెట్టు ఎక్కింది. అభిమానుల్లో విశ్వాసం పెంచుతూ టైటిల్ రేసులో బలంగా నిలుస్తోంది.