స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అదిరిపోయే విజయాన్ని సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 39 పరుగుల తేడాతో గెలిచింది.
GT బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (90; 55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) హీరోగా నిలిచాడు. సాయి సుదర్శన్ (52; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 114 పరుగులు జత చేశారు. చివర్లో జోస్ బట్లర్ (41*; 23 బంతుల్లో 8 ఫోర్లు) చెలరేగడంతో గుజరాత్ స్కోరు 198/3గా నిలిచింది.
లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ అజింక్యా రహానే (50; 36 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేయగా, రసెల్ (21) దూకుడు చూపాడు. చివర్లో రఘువంశీ (27*; 13 బంతుల్లో), రింకూ సింగ్ (17) రాణించినా టీమ్ స్కోరు 159/8కే పరిమితమైంది.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసారు. సిరాజ్, సుందర్, ఇషాంత్, సాయి కిశోర్ తలో వికెట్ దక్కించుకున్నారు. మైదానంలో అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిన గుజరాత్ టైటాన్స్ టేబుల్ పై తమ స్థానం మరింత బలపర్చుకుంది.
ఈ విజయంతో GTకు టోర్నీలో మరో కీలక గెలుపు లభించగా, KKRకు మరో అపజయం ఎదురైంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ జట్టు తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది.