స్పోర్స్ డెస్క్: టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతని ప్రదర్శన ఆకట్టుకుంది. 140 సగటుతో(యావరేజ్) 140 పరుగులు చేసి, ఐసీసీ వైట్‌బాల్ టోర్నీలో అత్యధిక సగటు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు.
ఈ క్రమంలో 2016 టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ సాధించిన 136.50 సగటు రికార్డును రాహుల్ బద్దలుగొట్టాడు. కోహ్లీ తర్వాత మహ్మద్ కైఫ్ (130), సౌరవ్ గంగూలీ (116), సునీల్ గవాస్కర్ (113) లాంటి దిగ్గజాలను రాహుల్ అధిగమించాడు.
ఐసీసీ టోర్నీలలో 100కుపైగా సగటు సాధించిన భారత ఆటగాళ్లలో రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గతంలోనూ ఓపెనర్‌గా అదరగొట్టిన రాహుల్, ఇప్పుడు మిడిలార్డర్‌లోనూ తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు.
ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో రాహుల్ రికార్డు ఏడో స్థానంలో ఉంది. మొత్తం లెక్కల్లో పాక్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ 209 సగటుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.