ఆస్ట్రేలియా: రెండో టెస్టులో టీమిండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేయడం అభిమానులకు పెద్ద నిరాశగా మారింది.
గత మ్యాచ్‌లో అద్భుత శతకం చేసి మురిపించిన కోహ్లీ ఈసారి పింక్ బాల్ టెస్టులో తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో విమర్శలు మళ్లీ ఊపందుకున్నాయి.
తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా రాణించలేకపోతోంది.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24) మరియు శుభ్‌మన్ గిల్ (28) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించగా, రాహుల్ (7), రోహిత్ శర్మ (6), కోహ్లీ (11) విఫలమయ్యారు.
ఆట ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే భారత్ ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది.
ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీసి భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. మిచెల్ స్టార్క్ ఒక వికెట్ సాధించాడు.
ప్రస్తుతం రిషభ్ పంత్ (28) మరియు నితీశ్ కుమార్ రెడ్డి (15) క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత్ భారీ మార్పు చూపించకపోతే ఇన్నింగ్స్ ఓటమి తప్పదని విశ్లేషకులు అంటున్నారు.