
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ (73*), దేవ్‌దత్ పడిక్కల్ (61) అద్భుతంగా రాణించారు. 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో అర్ధ శతకం చేసి, ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును సాధించాడు.
ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ (66)తో సమంగా ఉన్న కోహ్లీ, ఇప్పుడు 67 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు. శిఖర్ ధావన్ (53), రోహిత్ శర్మ (45), కేఎల్ రాహుల్ (43) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
టీ20 క్రికెట్ మొత్తంలో డేవిడ్ వార్నర్ (116) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కోహ్లీ (110) క్రిస్ గేల్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇది టీ20లలో కోహ్లీ స్థిరతకు పెద్ద ఉదాహరణగా మారింది.
మ్యాచ్‌లో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 157 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, కర్ణ శర్మ, మయాంక్ దయాల్ కట్టుదిట్టంగా రాణించారు. పంజాబ్ జట్టుకు ఇది మూడో ఓటమి కాగా, ఆర్సీబీకి ఇది ఐదో విజయం.