స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఆదివారం ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 158 పరుగుల ఛేదనలో కోహ్లీ (73 నాటౌట్, 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు.
చక్కటి ప్రణాళికతో ఆడిన కోహ్లీ, ఒత్తిడిలోనూ తన క్లాస్‌ని చూపిస్తూ మ్యాచును చక్కగా ఫినిష్ చేశాడు. అతని ఆటతీరు పట్ల భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. “కోహ్లీ లెజెండ్. అతను చేసే పని మరెవ్వరూ చేయలేరు” అంటూ సెహ్వాగ్ ప్రశంసించారు.
సెహ్వాగ్ అభిప్రాయం ప్రకారం, భారీ లక్ష్య ఛేదనల్లో స్ట్రైక్ రేట్ కంటే నిలకడ ముఖ్యం అని, కోహ్లీ ఎన్నోసార్లు దీన్ని నిరూపించాడన్నారు. జట్టుకు అవసరమైన సమయంలో నాటౌట్‌గా ఉండటం కోహ్లీ స్టైల్ అని వివరించారు.
ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఐపీఎల్‌లో 67 హాఫ్ సెంచరీలు/శతకాలను నమోదు చేసి డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం అతడు 8 సెంచరీలు సహా టోర్నీలో టాప్ స్థానం కలిగి ఉన్నాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, “ఒక భాగస్వామ్యం చాలు. నేను ఒక ఎండ్ నిలబడి ఆడుతున్నా, అది జట్టుకు ఉపయుక్తంగా మారుతోంది” అంటూ సంతృప్తి వ్యక్తం చేశాడు.