దుబాయ్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ టీం సారధి విరాట్ కోహ్లి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన రెండవ మరియు మూడవ టీ20ల్లో అజేయ అర్ధశతకాలతో(73, 77) అలరించిన కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరవ స్థానం నుండి ఐదవ స్థానానికి చేరుకున్నాడు.
ఇంకో వైపు వరుసగా డకౌట్లతో నిరాశపరుస్తున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానం నుండి నాలుగవ స్థానానికి పడిపోయాడు. టాప్-10లో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఈ ఇద్దరి మినహా మరెవరికి చోటు దక్కలేదు. కాగా, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకోగా, రెండవ స్థానంలో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, మూడో స్థానంలో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ నిలిచారు.
మరో వైపు బౌలింగ్ కి వస్తే, ఈ జాబితాలో టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌కు కూడా స్థానం లభించ్లేదు. టీ20 బౌలర్ల జాబితాలో ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంషీ రెండు, మరో ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
ఇక టీ20ల్లో ఆల్‌రౌండర్ల జాబితా చూస్తే ఒక్క టీమిండియా ఆటగాళ్ల ప్రాతినిధ్యం కూడా లేదు, ఈ జాబితాలో ఆఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ అగ్రస్థానంలో, బంగ్లాదేశ్ షకీబుల్ హసన్ రెండులో, ఆసీస్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మూడో స్థానంలో ఉన్నారు.