fbpx
Saturday, January 18, 2025
HomeSportsపంజాబ్ పై గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్

పంజాబ్ పై గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్

KOLKATA-DEFEATED-PUNJAB-KINGS-BY-5WICKETS

అహ్మదాబాద్‌: గతంలో కప్ గెలిచిన చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చాలా రోజుల తరువాత ఉపశమనం కలిగింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ పై కోల్‌కతా 5 వికెట్లతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పంజాబ్ తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్, చివర్లో క్రిస్‌ జోర్డాన్‌ (18 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిధ్‌ కృష్ణ (3/ 30), సునీల్‌ నరైన్‌ (2/22), కమిన్స్‌ (2/31) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు.

తదుపరి ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో కేవలం 5 వికెట్లు కోల్పోయి 20 బంతులు మిగిలి ఉండగానే 126 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. మోర్గాన్‌ (40 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ భారీ స్కోరు చేయకుండా కోల్‌కతా బౌలర్లు బాగా కట్టడి చేశారు. వరుసగా మూడు ఓవర్లలో పంజాబ్‌ రాహుల్‌ (20 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్‌), క్రిస్‌గేల్‌ (0), దీపక్‌ హుడా (1) వికెట్లను కోల్పోయింది. ఎక్కడో 5.3వ ఓవర్‌లో సిక్సర్‌ సాధించిన పంజాబ్‌కు మళ్లీ బౌండరీ సాధించడానికి ఏకంగా 26 బంతులు అవసరమయ్యాయి.

తన రెండు వరుస ఓవర్లలో మయాంక్, హెన్రిక్స్‌ (2)లను సునీల్‌ నరైన్‌ అవుట్‌ చేయగా, పూరన్‌ (19; 1 ఫోర్, 1 సిక్స్‌)ను వరుణ్‌ చక్రవర్తి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఛేదనలో కోల్‌కతా 3 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 17 పరుగులు మాత్రమే చేసి ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోయేలా కనిపించింది.

అయితే త్రిపాఠి, కెప్టెన్‌ మోర్గాన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకోవడంతో కోల్‌కతా లక్ష్యం దిశగా కదిలింది. చివర్లో త్రిపాఠి, రస్సెల్‌ (10) అవుటై నా… దినేశ్‌ కార్తీక్‌ (12; 2 ఫోర్లు) సాయంతో మోర్గాన్‌ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular