మూవీడెస్క్: ఇటీవలకాలంలో డిజిటల్ వేదికగా కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లో విడుదలవుతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ పై భారం తగ్గించుకోవడానికి, లేదా డిజిటల్ రైట్స్ ద్వారా పెట్టుబడిని రికవరీ చేసుకోవడానికి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇప్పుడు కోలీవుడ్ నుంచి రెండు క్రేజీ ప్రాజెక్టులు నేరుగా ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధమవుతున్నాయి.
మొదటిగా, కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3 సినిమా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇండియన్ 2 మూవీ డిజాస్టర్ కావడంతో, ఇండియన్ 3 థియేట్రికల్ రిలీజ్‌పై మేకర్స్‌కు నమ్మకం తగ్గిందని తెలుస్తోంది.
భారీ నష్టాలు ఎదుర్కొనే భయం లేకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
ఇక మరో ప్రాజెక్ట్‌గా టెస్ట్ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా మారి రూపొందిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీకీ సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.