fbpx
Saturday, January 11, 2025
HomeMovie Newsశింబు 'పత్తు తల' ఫస్ట్ లుక్

శింబు ‘పత్తు తల’ ఫస్ట్ లుక్

kollywoodHeroShimbu PathuThalaMovie FirstLook

కోలీవుడ్: కోలీవుడ్ యంగ్ హీరో శింబు వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన బాడీ ని పూర్వ రూపంలోకి మార్చుకున్న తర్వాత సినిమాల్లో వేగం పెంచాడు. ఈ సంక్రాంతికి శింబు నటించిన ‘ఈశ్వరన్’ సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తుంది. సినిమా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యాన్ మూమెంట్స్ ఎక్కువ ఉండడం తో శింబు ఫాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఈ సినిమాతో పాటు శింబు ‘మానాడు’ అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక ముస్లిం రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ సినిమా పైన అంచనాలు పెంచాయి. ఈ సినిమా తమిళ్ స్టైలిష్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం లో రాబోతుంది.

వీటితో పాటు శింబు ‘పత్తు తల’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ విడుదల చేసారు. కుర్చీ లో కూర్చొని కొంచెం ఏజుడ్ లుక్ లో శింబు ఉన్నాడు. ఈ సినిమాలో శింబు తో పాటు గౌతమ్ కార్తిక్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకం పై కే.ఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒబెలి . ఎన్.కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మిగతా వివరాలు కొన్ని రోజుల్లో తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular