తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్నారు. ఉగాది ముందుగానే మంత్రివర్గ విస్తరణ జరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు డబుల్ ధమాకా దక్కింది.
ఇప్పటికే వెంకటరెడ్డి కేబినెట్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఖరారైనట్టు సమాచారం. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి చామల కిరణ్‌ను గెలిపించిన ప్రతిఫలంగా అధిష్ఠానం రాజగోపాల్‌కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రాజగోపాల్ రెడ్డి అప్పటి నుంచి మంత్రి పదవి కోసం అధిష్ఠానం చెవిలో మాట వేస్తూ వస్తున్నారు. దీనితో అధిష్ఠానం ఆయనకు స్థానం ఇవ్వాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నిర్ణయంతో కోమటిరెడ్డి ఫ్యామిలీ తెలంగాణలో మరింత ప్రభావం చూపనున్నదని భావిస్తున్నారు.