తెలంగాణ: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ కాళ్లు మొక్కిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్తి క్రెడిట్ సోనియాదేనని స్పష్టం చేశారు.
“సోనియా గాంధీ చెప్పినట్లే తెలంగాణ వచ్చింది. ఆమె లేకపోతే తెలంగాణ కల నెరవేరేది కాదు” అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు నిజమైన నాయకత్వం కావాలని, కేసీఆర్ అయితే రాష్ట్రానికి విలన్‌గా మిగిలిపోయాడని మండిపడ్డారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను అవినీతిమయ పాలనగా అభివర్ణించారు. కేసీఆర్ సుమారు రూ.10 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అతడి పాలనలో అవినీతిపరులు జైలుకుపోయారని, మరికొందరు విదేశాలకు పారిపోయారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో ముందుకు సాగి, ఇంకా పెద్ద సభలు నిర్వహించే శక్తి కాంగ్రెస్‌కు ఉందన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతామని కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. కొత్త తెలంగాణను నిర్మించడంలో కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు.