తెలంగాణలో మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ మధ్య ప్రారంభమైన రాజకీయ వివాదం అక్కినేని కుటుంబానికి చేరడంతో టాలీవుడ్‌లో కొత్త చర్చలు మొదలయ్యాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ హీరోల ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ “వివాదం ఇక్కడితో ముగిద్దాం” అని మెత్తగా సూచించారు.
అయితే, టాలీవుడ్‌లో ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ, టాలీవుడ్ నుండి విమర్శలు ఆగలేదు. దీంతో సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి, “కొండా సురేఖ ఒంటరి కాదు, ఆమెకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడితే సహించం” అని కఠినంగా హెచ్చరించారు.
అప్పటినుంచి టాలీవుడ్ ఈ వివాదంపై నిశ్శబ్దంగా ఉంది, ముఖ్యంగా సురేఖ అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులపై ప్రశ్నించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు.
ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ సురేఖపై విమర్శలు మళ్ళీ చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. మరి కొండా సురేఖ-కేటీఆర్ మధ్య జరుగుతున్న వివాదం ఎప్పుడు ముగిస్తుందో చూడాలి.