టాలీవుడ్: మెగా హీరో గా ‘ఉప్పెన’ సినిమాతో హీరో గా పరిచయం అయ్యాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరి డెబ్యూ రికార్డులని తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి సినిమా విడుదల అవకముందే రెండవ సినిమాని సైలెంట్ గా పూర్తి చేసాడు వైష్ణవ తేజ్. ఈ మధ్యనే ‘కొండ పొలం’ అనే టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఒక తెలుగు నవల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టు ప్రకటించారు. ఈ సినిమాలో వైష్ణవ కి జోడీ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో ఒక గొర్ల కాపరి గా వైష్ణవ్ నటిస్తున్నాడు.
ఈ రోజు ఈ సినిమా నుండి ‘ఓబులమ్మ’ అంటూ సాగే పాటని విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాలో ‘ఓబుళమ్మ’ పాత్రని పోషిస్తున్న రకుల్ కి వైష్ణవ్ కి మధ్య ఉన్న లవ్ ని చూపిస్తూ ఈ పాట బాగా రూపొందించారు. మంచి మెలోడియస్ ట్యూన్ తో ఆకట్టుకున్నారు ఈ సినిమా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. అక్టోబర్ 8 న ఈ సినిమాని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. వరుణ్ తేజ్ కూడా తన రెండవ సినిమాని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘కంచె‘ అనే సినిమా ద్వారా బెస్ట్ పెర్ఫార్మన్స్ తో పాటు నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇపుడు వైష్ణవ్ కూడా అలాంటి కథా పరమైన సినిమాతో మరో హిట్ కొట్టే బాటలో ఉన్నాడు. ఈ సినిమా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడే సినిమాలా ఉండాలని ఆశిద్దాం.