మూవీడెస్క్: ఆచార్య సినిమా తర్వాత టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ మధ్య విభేదాల గురించి అనేక వార్తలు వచ్చాయి.
ఆచార్య సినిమా రిలీజ్ టైమ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు, ఫలితాన్ని చూసి నిరాశ చెందారు.
ఈ సినిమా రిజల్ట్ కారణంగా చిరంజీవి, కొరటాల శివ మధ్య మనస్పర్థలు వచ్చాయని, అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో దీనిపై చర్చలు జరిగాయి.
అయితే, కొరటాల శివ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
కొరటాల శివ మాట్లాడుతూ, ఆచార్య మూవీ ఫలితం తనను మానసికంగా కుంగిపోయేలా చేసిందని, కానీ ఆ సమయంలో తనకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ మెసేజ్ పంపిన వ్యక్తి అని తెలిపారు.
చిరు తనకు మెసేజ్ చేసి, “మంచి కమ్‌బ్యాక్ ఇస్తావు” అని చెప్పారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కొరటాల శివ స్పష్టం చేశారు.
తమ మధ్య గొడవలు ఉన్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని, ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని కొరటాల అన్నారు.
ఇక, కొరటాల శివ ఇచ్చిన ఈ క్లారిటీతో ఆచార్య వివాదం చాలా వరకు ముగిసిందని చెప్పొచ్చు.
చిరంజీవితో తనకు ఉన్న అనుబంధం చాలా బలమైనదని, సినిమా ఫలితం కారణంగా వచ్చిన దూరం లేదని కొరటాల స్పష్టం చేశారు.
ఇక ప్రస్తుతం దేవర సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కొరటాల శివ, ఈ ఇంటర్వ్యూలో తన తదుపరి ప్రాజెక్టులపై కూడా క్లారిటీ ఇచ్చారు.