మూవీడెస్క్: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప-2: ది రూల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగింది.
దాంతో ఆయన తదుపరి ప్రాజెక్టులపై భారీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు టాక్ ఉంది.
ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, బన్నీ ఫ్రీ అవగానే షూటింగ్ మొదలవుతుందని నిర్మాత నాగవంశీ ఇటీవల వెల్లడించారు.
ఇదే సమయంలో మాస్ డైరెక్టర్ కొరటాల శివతో బన్నీ మరోసారి చర్చలు జరిపినట్లు సమాచారం.
కొరటాల గతంలో బన్నీతో ఒక సినిమా ప్రకటించినప్పటికీ, ప్రాజెక్ట్ హోల్డ్‌లోకి వెళ్లింది.
ఇప్పుడు మరో కొత్త కథను కొరటాల శివ అల్లు అర్జున్‌కు నేరేట్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, త్రివిక్రమ్ సినిమా, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్, పుష్ప-3 తదితర కమిట్‌మెంట్లతో బన్నీ బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలవ్వడం కష్టమే.
దాంతోపాటు, కొరటాల శివ చేతిలో ప్రస్తుతం దేవర-2 ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వగానే బన్నీతో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా 2030 నాటికి ప్రేక్షకుల ముందుకు రానుందన్న టాక్ వినిపిస్తోంది.
మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందో వేచి చూడాలి.