మూవీడెస్క్: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కి ‘ఆచార్య’ సినిమా నిరాశ కలిగించిన తర్వాత ‘దేవర’తో మళ్ళీ విజయం సాధించారు.
ఎన్టీఆర్ వన్-మెన్ షోగా నిలిచిన ‘దేవర’ మంచి కలెక్షన్లు రాబడుతోంది, ఇప్పటికే 400 కోట్లు క్రాస్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.
అయితే, ‘దేవర 2‘ చిత్రం స్టార్ట్ కావడానికి కొంత సమయం పడేలా ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉండటంతో పాటు ‘డ్రాగన్’ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.
ఇది పూర్తయ్యాకనే ఎన్టీఆర్ ‘దేవర 2’ షూట్ చేయబోతున్నారు, అంటే ఇంకో రెండేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో కొరటాల శివ మరో సినిమా చేయాలనుకుంటున్నా, టైర్ 1 హీరోలు అందుబాటులో లేరని తెలుస్తోంది.
నాని లాంటి టైర్ 2 హీరోలు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో, కొరటాల శివ ‘దేవర 2’ కోసం మరింత వర్క్ చేయాలని, కథను డిఫరెంట్ గా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
మరి ఈ చిత్రానికి సంబంధించిన క్లారిటీ కోసం కొరటాల శివ ప్రకటించే తదుపరి అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూడాల్సిందే.