మూవీడెస్క్: టాలీవుడ్ లో నాలుగు సూపర్ హిట్స్ తో మంచి పేరు తెచ్చుకున్న కొరటాల శివ ఒక్క ‘ఆచార్య’ మూవీ వల్ల ఊహించని ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు.
అలాగే ట్రోల్స్ పెరిగాయి. అయితే, ఈ నిరాశ నుంచి త్వరగా కోలుకుని, ఆయన ఎన్టీఆర్ తో ‘దేవర’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరపైకి తెచ్చారు.
‘దేవర’ చిత్రం సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ముఖ్యంగా కొరటాల శివ కెరీర్ పరంగా మంచి బజ్ ఉంది.
ఈ చిత్రం విజయవంతమైతే, ఆయనకు మరలా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు.
మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలు కొరటాల శివకు రెండవ ఛాన్స్ ఇవ్వడానికి సిద్ధమే. కానీ వారి నిర్ణయం ఈ సినిమా విజయంపై ఆధారపడి ఉంది.
ముఖ్యంగా మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇక బన్నీతో గతంలోనే చేయాలని అనుకున్నప్పటికి సెట్టవ్వలేదు.
అదే విధంగా, పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో స్థిరపడిన అల్లు అర్జున్ కూడా కొరటాల శివతో కలిసి పని చేయాలనుకునే అవకాశం ఉంది. అయితే, ఇది పూర్తిగా ‘దేవర‘ విజయం మీదే ఆధారపడి ఉంటుంది.