మూవీడెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ తో “దేవర” సినిమా బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే, కొరటాల శివ తన సినిమాలలో సామాజిక అంశాలను ప్రస్తావించడం గురించి అందరికి తెలిసిందే. “మిర్చి” నుంచి “భరత్ అనే నేను” వరకు, ప్రతి సినిమాలో సామాజిక సందేశం కలిగి ఉంటుంది.
కానీ, “ఆచార్య” సినిమా ద్వారా కొరటాల శివ తెచ్చిన సందేశం ప్రేక్షకులకు విఫలమైందని విమర్శలు వచ్చాయి. “దేవర” చిత్రంలో ఏదైనా సామాజిక సందేశం ఉంటుందా అనే ప్రశ్న ఉంది.
ఇక, కొరటాల శివ సోషల్ మీడియాలో సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఉండేవారు. అయితే “దేవర” సినిమా షూటింగ్ తరువాత కొరటాల శివ సోషల్ మీడియా పై అంత యాక్టివ్ గా ఉండటం లేదు.
ఈ నేపథ్యంలో, ఆగష్టు 14న, కొరటాల శివ, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకులు జయప్రకాశ్ నారాయణ్ తో పాడ్ కాస్ట్ వీడియోలో పాల్గొనబోతున్నారు.
కాగా, ఈ పాడ్ కాస్ట్ చర్చలో సామాజిక, రాజకీయ అంశాలపై మాట్లాడబోతున్నారు. అలాగే దేవర సినిమా గురించి కొరటాల శివ ఏదైనా చెబుతారా అనే ఆసక్తి ఉంది.
ఇదిలా ఉండగా, జయప్రకాశ్ నారాయణ ఈ చర్చలో ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్స్ గురించి కూడా మాట్లాడతారని తెలుస్తోంది.