హైదరాబాద్: కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వం ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా కూడా కొందరు ఇంకా కనీసం జాగ్రత్తలు పాటించకుండా సామాజిక దూరం పాటించకపోవడం కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం చేయడం లేదు. ఈ కారణంగానే ఇండియాలో కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 12 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా వీడియోస్ ప్రిపేర్ చేసి మరి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అయినా కూడా కొందరు చాలా సింపుల్గా తీసి పారేసే ధోరణితో ఉన్నారని డైరెక్టర్ కొరటాల శివ ట్విట్టర్ లో విరుచుకుపడ్డాడు.
దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ లో దీని గురించి చాలా గట్టిగా స్పందించాడు. మాస్క్ పెట్టుకోని వారిని పశువులతో పోల్చి మరీ తన భావాన్ని వ్యక్తం చేశాడు. ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం అంటూ ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ప్లాప్ లేని డైరెక్టర్ కొరటాల శివ. దాదాపు చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కోసం 2 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు. అంతా అయిపోయి చివరకి షూటింగ్ మొదలు పెడదాం అంటే కరోనా , లాక్ డౌన్ వచ్చి షూటింగ్ ఆగిపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు అన్ని ముగించుకొని ఈ కరోనా సంక్షోభం అయిపోగానే ఫాస్ట్ గ షూటింగ్ వ్రాప్ చేసే ప్లాన్ లో ఉన్నాడు ఈ డైరెక్టర్.