హైదరాబాద్: కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబో లో ఒక సినిమా వస్తుందని గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ ని నిజం చేస్తూ ఈరోజు అఫిషియల్ గా వీళ్ళ కాంబో సినిమాని ప్రకటించారు. అల్లు అర్జున్ 21 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని అల్లు అరవింద్, కొరటాల శివ స్నేహితుడు అయిన ఎం సుధాకర్ కలిసి GA2 పిక్చర్స్ మరియు యువసుధ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే బన్నీ స్నేహితులైన శాండీ, స్వాతి, నట్టి లు సహ- నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కొరటాల శివ అనగానే కమర్షియల్ సినిమా అయినప్పటికీ సామాజిక అంశాలతో కూడిన విలువలు కలిగిన సినిమాగా రూపొందిస్తారు. తన ప్రతి సినిమాలో అన్ని అంశాలు ఉండేట్టు చూసుకుంటారు. అందుకే ఇండస్ట్రీ లో ప్లాప్ లేని డైరెక్టర్ గా ముందుకు సాగుతున్నాడు. ఈరోజు విడుదల చేసిన పోస్టర్ కూడా అదే అంచనాలకి క్రియేట్ చేస్తుంది. ఇద్దరు స్నేహితులు ఒక నది ఒడ్డున నిల్చొని అవతల ఊరుని చూస్తున్నట్టు కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో నది ఒడ్డున ఫ్యాక్టరీ లాగ కనిపిస్తుంది. చూస్తుంటే వూరు ఉసూరు తీసుకుంటున్న ఫ్యాక్టరీ పని పట్టే స్నేహితుల కథలాగా కనిపిస్తుంది. అయితే పోస్టర్ ప్రకారం ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ తో పాటు ఇంకో బలమైన క్యారెక్టర్ హీరో ఫ్రెండ్ రోల్ ఉన్నట్టుంది. దానికి ఇంతవరకు ఎవరిని అధికారికంగా ప్రకటించలేదు. 2022 కి ఈ సినిమాని సిద్ధం చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.
ఈ ఏడాది ఆరంభం లో ‘ఆలా వైకుంఠపురం లో ‘ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన అల్లు అర్జున్ తరువాత తనకి మొదటి హిట్ ఇచ్చిన సుకుమార్ తో ‘పుష్ప’ సినిమాని చేస్తున్నారు. అలాగే కొరటాల శివ కూడా మెగా స్టార్ చిరంజీవి తో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కరోనా వల్ల రెండు సినిమాలు షూటింగ్ మొదలుపెట్టేలోపే పరిస్థితులు బాగాలేక ఆగిపోయాయి. వీళ్లిద్దరు ఆ సినిమాలని ముగించి ఈ సినిమాకోసం కలిసి పని చేసే ఆలోచనలో ఉన్నారు. లాక్ డౌన్ ని కరెక్ట్ గా వాడుకొని భవిష్యత్ ప్రాజెక్టుల్ని వీళ్ళు మంచిగా ప్లాన్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు.