దర్శకుడు క్రిష్ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు. గమ్యం, వేదం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలతో తన దారే వేరు అనిపించాడు. తక్కువ బడ్జెట్‌తో నాణ్యమైన కంటెంట్‌ను అందించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా క్రిష్ పరిస్థితి డిఫరెంట్ గా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ తో మొదలైన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. హైప్ వచ్చినా ఫలితం లేకపోవడం, మణికర్ణిక ప్రాజెక్ట్ నుంచి బయటపడటం, హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడం ఇలా అన్ని ప్లానింగ్ లోనే తడబడుతున్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లో కన్‌ఫ్యూజన్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక నూతన చిత్రం ఘాటి టీజర్‌తో ఆసక్తి పెంచినా, విడుదలపై స్పష్టత లేక పోవడం మరోసారి గందరగోళాన్ని తేల్చేసింది. ఒకప్పుడు స్పీడ్‌గా సినిమాలు పూర్తి చేసే క్రిష్, ఇప్పుడు ప్రాజెక్ట్‌లు ముందుకు తీసుకెళ్లడంలో తడబడుతున్నట్టు కనిపిస్తోంది.
కథల ఎంపికలో సత్తా ఉన్నా, ప్లానింగ్, టైమ్ మేనేజ్‌మెంట్ లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పరిశీలకుల అభిప్రాయం. ప్రత్యేకంగా క్రిష్ తరహా డైరెక్టర్లకు నిర్దిష్ట ప్రణాళిక అవసరం. ఈ నేపథ్యంలో క్రిష్ మరలా తన ట్రాక్‌పైకి రావాలంటే ఓ బలమైన కథతో క్లారిటీ స్కెచ్ తీసుకుని, స్క్రిప్ట్‌కి తగిన విధంగా ముందుకు సాగాలన్నది అభిమానుల ఆకాంక్ష.