fbpx
Sunday, January 19, 2025
HomeMovie NewsPSPK27 ప్రీ లుక్ పోస్టర్

PSPK27 ప్రీ లుక్ పోస్టర్

KrishJagarlamuriPawankayan Combi PSPK27PrelookReleased

టాలీవుడ్: పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు తియ్యడం మొదలుపెట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వరుసగా లైన్ లో పెడుతున్నాడు. ఇప్పుడు అయన చేతిలో ఉన్న సినిమాల్లో కేజ్రీ ప్రాజెక్ట్ అంటే క్రిష్ జాగర్లమూడి తో చేస్తున్న 27 వ సినిమానే. ఇప్పటికి కేవలం 15 రోజుల షూటింగ్ మాత్రమే జరిపినట్టు ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెలుపుతూ ఈ సినిమా నుండి హీరో ప్రీ లుక్ విడుదల చేసారు.

ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ ని విడుదల చేసారు సినిమా టీం. ప్రీ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఒక పీరియాడిక్ సినిమాగా అనిపిస్తుంది. ఈ సినిమాతో ఎప్పుడో తనతో సినిమా తీస్తాను అని మాటిచ్చిన ఒకప్పటి భారీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తన కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడని అర్థం అవుతోంది. పవన్ ఫేస్ ని రివీల్ చేయకుండా ధీరత్వంతో నడుము మీద చేయి వేసుకుని నిలబడినట్లు చూపించారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఓ హిస్టారికల్ పాత్ర పోషించబోతున్నాడని స్పష్టం అయింది. ఈ పోస్టర్ పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.మొదటిసారి పవన్ కళ్యాణ్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా రామ్ – లక్ష్మణ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేసాయనున్నారు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular