టాలీవుడ్: ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నటి ‘కృతి శెట్టి‘. మొదటి సినిమా విడుదల అవకముందే చేతిలో మూడు సినిమాలతో బిజీ గా వుంది ఈ హీరోయిన్. నాని నటిస్తున్న ‘శ్యామ్ సింఘరాయ్’ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయింది. వీటితో పాటు ఇంకా అధికారికంగా ప్రకటించని మరొక సినిమా ఉందని టాక్ నడుస్తుంది.
ఇవే కాకుండా రామ్ పోతినేని హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న బైలింగువల్ సినిమాలో కూడా హీరోయిన్ గా కృతి శెట్టి ఎంపిక అయింది. ఈ రోజు విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సినిమా టీం. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ 19 వ సినిమాని తెలుగు మరియు తమిళ్ లో డైరెక్ట రిలీజ్ కోసం తయారు చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పని చేసే మిగతా టెక్నిషియన్స్ వివరాలు తెలియాల్సి వుంది. ఏది ఏమైనా ఒక్క సినిమా తోనే వరుస ఆఫర్లతో బిజీగా వుంది ఈ లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్.