ముంబై : ముంబై ఎయిర్పోర్ట్ లో టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2020 క్రికెట్ సంబరం ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు అతడిని అడ్డుకున్నాయి.
యుఎఇ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం మరియు దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
క్రునాల్ సాయంత్రం 5 గంటల తరువాత యుఎఇ నుండి విమానంలో తిరిగి వచ్చాడు, అతన్ని విమానాశ్రయంలో డిఆర్ఐ సిబ్బంది ఆపివేశారు. నవంబర్ 10 న దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐదవ ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో క్రునాల్ పాల్గొన్నాడు.