fbpx
Sunday, January 19, 2025
HomeMovie News‘క్షీరసాగర మథనం’ టీజర్​ విడుదల

‘క్షీరసాగర మథనం’ టీజర్​ విడుదల

KsheeraSagaraMadhanam Teaser Released

టాలీవుడ్: విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ‘క్షీరసాగర మథనం’ అనే కొత్త సినిమా టీజర్ విడుదల చేసాడు. ‘నువ్వు ఒక గంటలో చనిపోతావు అంటే ఏం చేస్తావ్’ అనే క్యాప్షన్ తో ఈ సినిమా టీజర్ విడుదల చేసాడు డైరెక్టర్ క్రిష్. మానవ సంబంధాలకు అద్దం ప‌ట్టే విధంగా ఏడు పాత్ర‌ల తాలూకు భావోద్వేగాలతో రూపొందిన సినిమా‌ క్షీర సాగ‌ర మ‌థ‌నం. దాదాపు మొత్తం కొత్త టీం తోనే ఈ సినిమా సిద్ధం అవుతుంది. ‘ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాని అనిల్ పంగులూరి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ ఆరాసాడా ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, సంతోష్ శనమొని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. షూటింగ్ ముగించుకొని విడుదల చేసేందుకు ఈ సినిమా సిద్ధం అవుతుంది. ఇందులో బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ లోని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
‘ఎగసే అలలు ,
మనసులోని భావాలు
అదుపులో ఉన్నంతవరకు అందంగానే ఉంటాయి.
ఒక్క సారి అదుపు తప్పి , తప్పుదారి పడితే
చేసిన తప్పు తెలిసిన క్షణం మరణం ముందుగా ఉంటే

మనలో మనకే తెలియగ జరిగే అంతర్మథనమే ఈ క్షీర సాగర మధనం’

అంటూ సాగే డైలాగ్స్ సినిమా పై కొంచెం అంచనాలని పెంచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular