KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణలోని చిరుద్యోగులు మరియు కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఓ పత్రిక కథనాన్ని పంచుకుంటూ, దసరా పండుగ సమీపించినప్పటికీ ఉద్యోగుల చేతిలో డబ్బులు లేక, సరుకులు కొనలేని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు రాలేదని, పంచాయతీ కార్మికులు, మున్సిపాలిటీ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది, హాస్టల్ వర్కర్లు, గెస్ట్ లెక్చరర్లు సహా అనేక విభాగాల్లో ఉద్యోగులు తిప్పలు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ 10 నెలల పాలనలో తెచ్చిన రూ.80 వేల కోట్ల అప్పులు ఎక్కడ పోయాయని ప్రశ్నిస్తూ, వెంటనే వేతనాలు చెల్లించి, కార్మికుల అవస్థలు తీర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.