హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టు మరోసారి మధ్యంతర ఊరట ఇచ్చింది.
డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం నాడు జరిగిన విచారణలో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు విచారణలో, ఏసీబీ తమ అభిప్రాయాన్ని కోర్టు ముందు ఉంచింది. కేటీఆర్‌ను విచారణకు హాజరుచేసే అనుమతి ఇవ్వాలని, ఇప్పటికే ఉన్న అరెస్ట్ నిషేధాన్ని రద్దు చేయాలని కోరింది.
అయితే కోర్టు, తదుపరి విచారణను డిసెంబర్ 31కు వాయిదా వేస్తూ కేటీఆర్‌కు మధ్యంతర బెయిల్‌ను కొనసాగించింది.
ఈ కేసు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫార్ములా ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగంపై ఏసీబీ దాఖలు చేసిన కేసులో కేటీఆర్ పేరును చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు తుది నిర్ణయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.