తెలంగాణ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుండి అరుదైన గౌరవం దక్కింది. 2025 ఏప్రిల్ 19న జరిగే ఐబీసీ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది.
తెలంగాణను పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లిన కేటీఆర్ కృషిని గుర్తిస్తూ ఈ ఆహ్వానం అందించినట్లు యూనివర్సిటీ పేర్కొంది.
కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పదేళ్ల పాటు పని చేసిన సమయంలో తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసి, టెక్ కంపెనీల హబ్‌గా నిలిపారు.
ఈ నేపథ్యంలో అతని నాయకత్వం, అభివృద్ధి ప్రణాళికలపై ప్రసంగించేందుకు అమెరికా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ప్రకారం, తెలంగాణ అభివృద్ధి క్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా ఉద్యోగావకాశాలు, స్టార్టప్‌ల వృద్ధికి కేటీఆర్ కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. హైదరాబాదును ఐటీ కేంద్రంగా మార్చడంలో అతని పాత్రను విశేషంగా కొనియాడింది.
ఈ ఆహ్వానం కేటీఆర్‌కి అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ప్రాధాన్యతను సూచిస్తోందని బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కోసం తన కృషిని గ్లోబల్ లెవెల్‌లో గుర్తించడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.