తెలంగాణ భవన్: మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. డిక్లరేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా కింద ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని, దీని వెనుక కుట్రే దాగి ఉందని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ నేతలు రైతు బంధుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తమ హయాంలో 70 లక్షల మంది రైతులకు రైతు బంధు సొమ్ము పారదర్శకంగా అందించామని స్పష్టం చేశారు.
రేపు జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై పిచ్చి నిర్ణయం తీసుకోకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులను దొంగలుగా చిత్రీకరించడం సరికాదని, ప్రభుత్వం వారిపై ప్రమాణ పత్రం ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలతో రైతులను మోసగిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.