fbpx
Thursday, December 19, 2024
HomeTelanganaతనపై ఏసీబీ కేసుపై కేటీఆర్ స్పందన

తనపై ఏసీబీ కేసుపై కేటీఆర్ స్పందన

KTR’S RESPONSE TO ACB CASE AGAINST HIM

తెలంగాణ: తనపై ఏసీబీ కేసుపై కేటీఆర్ స్పందన

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కుంభకోణంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో, మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) స్పందిస్తూ ‘‘ఫార్ములా-ఈ రేస్‌లో కుంభకోణం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలి. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌పై అన్ని వాస్తవాలు వివరిస్తా’’ అని అన్నారు.

ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఏ3గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది.

అసెంబ్లీలో హరీశ్‌రావు విమర్శలు
ఈ అంశంపై భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో గళమెత్తారు. ‘‘ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. కేటీఆర్‌ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారు’’ అని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular