శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కుబేర నుంచి ఫస్ట్ సింగిల్ పోస్టర్ విడుదలైంది. తమిళ స్టార్ ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక మొదటి పాటను ఏప్రిల్ 20న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఫస్ట్ సింగిల్ పోస్టర్‌లో ధనుష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడుతున్నాడు. వెనుకవైపు భారీ ర్యాలీ, మ్యూజికల్ జాతర వాతావరణం ఉండటంతో ఇది ఫెస్టివల్ సాంగ్ అనిపిస్తోంది. ఈసారి శేఖర్ కమ్ముల తన స్టైల్‌కి మాస్ టచ్‌ను జోడించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మాస్ బీట్స్‌కి పేరు గాంచిన ఆయన ఈ సాంగ్‌కి ఓ రేంజ్ ఊపు తీసుకురానున్నట్టు టాక్. ఏప్రిల్ 19న ప్రోమో వచ్చి, 20న ఫుల్ సాంగ్ రిలీజవుతుందన్న బజ్‌తో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి భారీ బడ్జెట్ కేటాయించారు. ఫస్ట్ సింగిల్ పోస్టర్ మేకింగ్‌కి ప్రమాణం లాగా ఉంది. కుబేర మీద అంచనాలు ఇప్పుడు మరింతగా పెరిగాయి.