మూవీడెస్క్: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కుబేర విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది.
ఈ సినిమాను డిసెంబర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది.
ప్రస్తుతం తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 21న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, జిమ్ సర్బా కోటీశ్వరుడిగా కనిపించనున్నారు.
అలాగే నాగార్జున, రష్మిక మందన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గ్లింప్స్ వీడియో ఇటీవల విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది.
ముఖ్యంగా యూత్ టార్గెట్ చేసుకున్న సినిమాలకు ఈ టైమ్ సవాలుగా భావిస్తారు.
కానీ కుబేర నిర్మాతలు ఫిబ్రవరిలోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఫిబ్రవరి నెల సినిమాలకు అనుకూలమైన సమయం కాదనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆ టైమ్ లో ఎక్కువగా పరీక్షలు ఉంటాయి.
యూత్ పిల్లలు చదువులో బిజీగా ఉంటారు. కాబట్టి థియేటర్స్ రావడం కష్టం.
శేఖర్ కమ్ములకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకు పెద్ద బలం అవుతుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి.
అనంద్, ఫిదా, హ్యాపీ డేస్ లాంటి చిత్రాలతో ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కమ్ముల ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు.
సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా థియేటర్లలో సరికొత్త అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
మరి, ఫిబ్రవరిలో రిస్క్ టైమ్‌లో విడుదలవుతోన్న కుబేర ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో చూడాలి.