మూవీడెస్క్: ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కుబేర మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది.
సార్ తర్వాత ధనుష్ తెలుగులో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది.
ఈ సినిమాలో ధనుష్ పేదవాడి పాత్రలో కనిపించనుండగా, నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
కుబేర డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతుందని ఒక టాక్ వచ్చింది. సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు డిసెంబర్ 6న పుష్ప ది రూల్ విడుదల అవుతుండడంతో, ఆ సమయానికి వస్తే ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే డిసెంబర్ 20న గేమ్ చేంజర్ కూడా విడుదల కావడంతో, కుబేర కంటెంట్ పై ఆధారపడి పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది.
శేఖర్ కమ్ముల సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఎక్కువగా ఉండడంతో, గేమ్ చేంజర్ తో పోటీగా రిలీజ్ చేసినా పెద్ద సమస్య ఉండకపోవచ్చని అంచనా.
ఏదేమైనా, కుబేర డిసెంబర్ లో విడుదల అయితే, థియేటర్స్‌లో ఆసక్తికరమైన పోటీని చూడవచ్చు.