మూవీడెస్క్: స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్, తొలి ప్రయత్నంలో ‘కరెంట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత సుకుమార్ పర్యవేక్షణలో కుమారి 21ఎఫ్ సినిమాతో సూర్య ప్రతాప్ రెండోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి, విజయం సాధించాడు.
సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఘోరంగా విఫలమవడంతో సూర్య ప్రతాప్ కొంతకాలం సుకుమార్ టీమ్‌లోనే రైటర్‌గా కొనసాగాడు.
ఈ సమయంలో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘నేనొక్కడినే’కి రైటర్‌గా పని చేశాడు. ఇక ఆ తరువాత అతఙ డైరెక్ట్ చేసిన 3వ సినిమా ‘18 పేజెస్’ అనే చిత్రం సైతం సుకుమార్ కథతోనే తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం సూర్య ప్రతాప్ తన క్రియేటివిటీని పూర్తిగా వినియోగించుకుంటూ స్వతంత్రంగా దర్శకత్వం వహించడానికి సిద్దమవుతున్నారు.
ఇటీవల సూర్య ప్రతాప్ నందమూరి కళ్యాణ్ రామ్‌కు ఒక కథను వినిపించాడట. ఆ కథ కళ్యాణ్ రామ్‌కు నచ్చడంతో ఆయన హీరోగా నటించడమే కాకుండా తన స్వీయ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ పైనే సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘NKR21’ అనే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమాకు ‘మెరుపు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది, నవంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.