కరీంనగర్ : ఇటీవల హైదరాబాద్ లో జరిగిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్ పార్టీ కుంట శ్రీనివాస్‌పై ఆ పార్టీ చర్యలకు ఆదేశించింది. శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఆదేశాలు జారీచేసింది.
ఆయన ప్రస్తుతం పార్టీ మంథని మండలాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాద దంపతుల దారుణ హత్య వ్యహహారంలో కుంట శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోన్న విషయం విదితమే. వామన్‌రావు ఆయన మరణ వాగ్మూలంలోనూ కుంట ప్రసాద్ పేరునే ప్రస్తావించడం జరిగింది. దీంతో టీఆర్‌ఎస్ పార్టీపై, శ్రీనివాస్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ కేసు వ్యవహారంలో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్పందించిన టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నపలంగా అతనిపై వేటు వేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం .శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.