మూవీడెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో పాటలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. అందులో కుర్చీ మడతపెట్టి పాట మహేష్ అభిమానులకు ఒక గిఫ్ట్ గా మారిపోయింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “గుంటూరు కారం” సినిమాలో ఈ పాట ఊరమాస్ స్టైల్లో ఉండటంతో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఇక గ్లోబల్ రేంజ్ లో 2024 టాప్ ట్రెండింగ్ సాంగ్స్ లో ఈ పాట కూడా నిలిచింది. యూట్యూబ్ లో 500కి పైగా మిలియన్ వ్యూవ్స్ అందికున్న విషయం తెలిసిందే.
సాంగ్ విడుదలైనప్పటి నుంచే మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటను ఎండ్‌లెస్‌గా ట్రెండ్ చేస్తూ, వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ పాటలో మహేష్ బాబు స్టైలిష్ లుక్, డాన్స్ మూవ్‌మెంట్స్, మాస్ బీట్‌కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.
పాటలో మహేష్ అందరికీ సింప్లీ సూపర్ అని అనిపించారు.
“గుంటూరు కారం” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోకపోయినా, “కుర్చీ మడతపెట్టి” పాట మాత్రం సినిమా పేరును ప్రతిష్టాత్మక స్థాయికి తీసుకెళ్లింది.
యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ అందుకున్న ఈ పాట, టాప్ మ్యూజిక్ చార్ట్‌లలో నిలిచింది.
.