కోలీవుడ్: నలుగురు దర్శకులు కలిసి ”కుట్టి లవ్ స్టోరీ” పేరుతో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. భిన్నమైన నాలుగు ప్రేమకథలతో ఈ వెబ్ సిరీస్ రూపొందబోతోంది. తమిళ్ సినిమాలో మంచి పేరున్న ‘గౌతమ్ వాసుదేవ్ మీనన్‘, ‘వెంకట్ ప్రభు’, ‘విజయ్’, ‘నలన్ కుమారస్వామి’ నలుగురు కలిసి ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన టీజర్ ని ఇవాల విడుదల చేసారు మేకర్స్. ఈ టీజర్ లో నలుగురు దర్శకుల వాయిస్ ఓవర్ తో నాలుగు భిన్నమైన ప్రేమ కథాంశాలకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్నట్లు చూపించారు. దీనికి కార్తీక్ నేపథ్య సంగీతం అందించాడు. ”ప్రేమ కోసం నలుగురు దర్శకులు, నాలుగు కుట్టి ప్రేమ కథలు..” అంటూ విడుదలైన ఈ ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది.
మామూలుగా లవ్ థీమ్ నేపధ్యం ఉన్న సినిమాలు తియ్యడం లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దిట్ట. అలాంటిది ఇపుడు నలుగురు దర్శకులు కలిసి నాలుగు ప్రేమ కథలు చెప్పబోతున్నారు. ఇప్పటివరకైతే ఈ వెబ్ సిరీస్లో నటిస్తున్న నటీనటులు, ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఏంటీ అనేది ప్రకటించలేదు కానీ ప్రోమో విడుదల చేసి ఆకట్టుకున్నారు.