fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsమెగా స్టార్ స్టెప్స్ తో 'ఆచార్య' సాంగ్ ప్రోమో

మెగా స్టార్ స్టెప్స్ తో ‘ఆచార్య’ సాంగ్ ప్రోమో

LaaheLaahe SongPromoFrom Aacharya

టాలీవుడ్: మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి తర్వాత ‘ఆచార్య’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మెగా స్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ్ కూడా 30 నిమిషాల నిడివి ఉండే ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి అవసరం వచ్చే అంశాలని జోడించి సినిమాలు తీయడం లో కొరటాల శివ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా అదే కోణంలో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా నుండి ‘లాహే లాహే’ అంటూ సాగే మొదటి పాటని రేపు విడుదల చేయనున్నారు. అంతకు ముందే ఈ రోజు ఈ సాంగ్ ప్రోమో ఒకటి విడుదల చేసారు. చిరు మార్క్ స్టెప్స్ తో ఈ ప్రోమో ఆకట్టుకుంది. చిరంజీవి కూడా ఈ సినిమా కోసం చాలా సన్నగా అయినట్టు ప్రోమో మరియు పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో చిరు కి జోడీ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా కోసం మణి శర్మ చాలా సంవత్సరాల తర్వాత చిరు తో కలిసి పని చేయనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మే 13 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular