fbpx
Saturday, January 18, 2025
HomeMovie News'ఆచార్య': 'లాహే లాహే' పాట విడుదల

‘ఆచార్య’: ‘లాహే లాహే’ పాట విడుదల

LaaheLaahe SongReleaseFrom Aacharya

టాలీవుడ్: మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ప్లాప్ చవి చూడని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కమర్షియల్ అంశాలు జోడిస్తూనే సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఒక సందేశం ఇస్తూ సినిమాలు తీయడంలో కొరటాల శివ నిపుణుడు. ఈ సినిమాలో దేవాలయాల్లో జరిగే అవినీతిని చూపించబోతున్నాడని ఒక టాక్ ఉంది. ఈ సినిమా కోసం దేవాలయానికి సంబందించిన ఒక పెద్ద సెట్ కూడా వేసినట్టు ఒక వీడియో ద్వారా చూపించారు.

ఈ రోజు ఈ సినిమా నుండి మొదటి పాటని విడుదల చేసారు. శంకరుని గురించి సాగే ఈ పాట చిరు పాత పాటల్ని గుర్తుకు తెచ్చింది. లాహే లాహే అంటూ సాగే ఈ పాత శివుణ్ణి కొలుస్తూ పాడే పాటగా ఆకట్టుకుంది. మణి శర్మ , చిరు కాంబినేషన్ లో వచ్చిన ఓల్డ్ క్లాసిక్ పాటని తలపిస్తుంది. మద్యలో వచ్చే చిరు స్టప్స్ , సెట్ అప్ అంతా ఇంద్ర సినిమా పాటని తలపిస్తుంది. ఈ పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత దేవుణ్ణి కొలిచే నృత్యకారిణిగా కనిపించనుంది. పాట మద్యలో కాజల్ కూడా మెరిసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు. మాటినీ మూవీ ఎంటెర్టైనెంట్న్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మే 13 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular