టాలీవుడ్: టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన రానా ప్రస్తుతం ‘విరాట పర్వం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా 1990 ల బ్యాక్ డ్రాప్ లో జారిన ఒక నక్సలైట్ ‘కామ్రేడ్ రవన్న’ పాత్రలో నటిస్తున్నాడు. 1990 ల్లో రాజకీయాలకి అతీతంగా పోరాడే విప్లవకారుల కథని బేస్ చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి , ప్రియమణి, నందిత దాస్, నివేత పేతురేజ్ నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూ లో రానా మాట్లాడుతూ తన కారెక్టర్ కన్నా సాయి పల్లవి పాత్ర చాలా బాగుంటుందని అందుకే సినిమా పోస్టర్స్ లో సాయి పల్లవి పేరే ముందుండేలా పెట్టాం అని కూడా చెప్పారు.
ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా రానా వాయిస్ ఓవర్ తో ఈ సినిమాలోని ఇన్స్పిరేషనల్ విమెన్ కారెక్టర్స్ ని ప్రెసెంట్ చేస్తూ ఒక వీడియో విడుదల చేసారు. ‘ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన వ్యక్తిత్వం ఈమెది’, ‘చరిత్రలో దాగిన కథలకి తెరలేపిన ప్రేమ తనది’, ‘మహా సంక్షోభమే ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవం తనది ‘, ‘అడవి బాట పట్టిన వీరుల తల్లులకు వీరు ప్రతి రూపాలు’ అని రానా వాయిస్ ఓవర్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా పాత్రలు వస్తూ చివర్లో వీరమాతలందరికి రెడ్ సెల్యూట్ (లాల్ సలాం) అంటూ స్ఫూర్తిదాయకమైన మాటలతో వీడియో రిలీజ్ చేసారు. సినిమా కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఒక గొప్ప సినిమా అవుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది సినిమా టీం.
సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఎస్.ఎల్.వీ సినిమాస్ బ్యానర్స్ పై సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చేకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ‘నీది నాది ఒకే కథ‘ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని రూపొందిన వేణు ఊడుగుల ఈ సినిమాని దర్శకత్వం వహించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకి అందించిన సంగీతం ఇప్పటికే మంచి హిట్ టాక్ తో టాప్ లిస్ట్ లో ఉంది. ఏప్రిల్ 30 న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.