fbpx
Thursday, April 10, 2025
HomeMovie News'మిస్ ఇండియా' నుండి లచ్చగుమ్మాడి పాట విడుదల

‘మిస్ ఇండియా’ నుండి లచ్చగుమ్మాడి పాట విడుదల

LachaGummadi SongReleasedFrom MissIndiaMovie

టాలీవుడ్: కీర్తి సురేష్ నటించి షూటింగ్ పూర్తి చేసి విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమాల్లో ‘మిస్ ఇండియా’ సినిమా ఒకటి. నవంబర్ 4 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అవబోతుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ద్వారా ఈ సినిమా పైన ఆసక్తి రేకెత్తించారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తన అసాధారణ కలలని ఎలా నెరవేర్చుకుందని అందుకోసం తన ప్రయత్నాన్ని చాలా బలంగా చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన ‘లచ్చగూమ్మాడి’ అనే పాట విడుదల చేసింది ఈ సినిమా టీం.

థమన్ సంగీతం తో రూపుదిద్దుకున్న ఈ పాట లిరికల్ వీడియో ని సాండ్ ఆర్ట్ ని జోడించి విడుదల చేసారు. గేయ రచయిత కళ్యాణ్ చక్రవర్తి పాటని చాలా అద్భుతంగా రాసాడు. ఒక మిడిల్ క్లాస్ ఆర్డినరీ అమ్మాయి యొక్క ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రయాణాన్ని చాలా ఆలోచింపచేసేలా రాయడంలో విజయవంతం అయ్యాడు. సింగర్ శ్రీ వర్దిని కూడా తన గాత్రం తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నదియా, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు , మలయాళం మరియు తమిళ్ భాషల్లో విడుదల చేస్తున్నారు.

Lacha Gummadi Lyrical Video Song | Miss India Songs | Keerthy Suresh | Narendra Nath | Thaman S

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular