టాలీవుడ్: ఫిబ్రవరి మార్చ్ నెలలో విడుదలైన సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఈ మధ్యనే ఉప్పెన ఓటీటీ లో విడుదలైంది. ఈ వారం లో మార్చ్ లో విడుదలైన మరిన్ని సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. నాగార్జున హీరోగా నటించిన మూవీ ‘వైల్డ్ డాగ్’ నిన్నటి నుండి ఓటీటీ లో అందుబాటులోకి వచ్చింది. టాక్ పరవాలేదనిపించినా జనాలలో ఈ సినిమా పై అంత బజ్ లేకపోవడం అలాగే కరోనా ఎఫెక్ట్ కూడా కొంత ఉండడం తో కలెక్షన్స్ పరంగా నిరాశ పరచిన ఈ సినిమా నెట్ ఫ్లిక్ ఓటీటీ లో అందుబాటులో ఉంది.
మార్చ్ చివర్లో విడుదలైన ‘చావు కబురు చల్లగా’ సినిమా రిలీజ్ కి ముందు చేసిన హడావిడి అంతా రిలీజ్ రోజే తేలిపోయింది. ఈ సినిమాకి ఏ రకంగా కూడా మంచి టాక్ గాని కలెక్షన్స్ గాని రాకపోవడం తో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈరోజు నుండి ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ లో అందుబాటులో ఉంది. ఓటీటీ కోసం ఈ సినిమాని కొంత ఎడిట్ చేసి ప్రేక్షకులకి నచ్చేవిధంగా ఎడిట్ చేసినట్టు మేకర్స్ తెలిపారు.
ఇవే కాకుండా ఇండియన్ ఒలింపిక్ మెడలిస్ట్ ‘సైనా నెహ్వాల్’ కథ ఆధారంగా రూపొందిన ‘సైనా’ బయోపిక్ కూడా ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం వలన ఈ సినిమా వచ్చిన విషయం జనాలకి తెలిసే లోపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇలా ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ‘వకీల్ సాబ్’ తప్ప దాదాపు మిగతా తెలుగు సినిమాలన్నీ ఓటీటీలోకి వచ్చినట్లే.