టాలీవుడ్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి థియేటర్ లు తెరుచుకునే అవకాశాలు ఉన్నా కూడా ఇంకా కొన్ని సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయి. ఇలా చూస్తుంటే థియేటర్ లు తెరచుకున్నా కూడా ఓటీటీ రిలీజ్ లు క్రమ క్రమంగా పెరుగుతూ ఉండవచ్చు అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ వారం కొన్ని డైరెక్ట్ సినిమాలు ఓటీటీ లో విడులవుతున్నాయి. కొన్ని థియేటర్ రిలీజ్ లు కూడా ఓటీటీ లో ఈ వారం వస్తున్నాయి.
ముందుగా మలయాళ నటుడు పృథ్వి నటించిన ‘కోల్డ్ కేస్‘ సినిమా, ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో నిన్ననే విడుదల చేసారు. ఒక క్రైమ్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ సినిమా ని రూపొందించారు. మలయాళం లో ఇదివరకే పృథ్విరాజ్ తీసిన థ్రిల్లర్ సినిమాలు సూపర్ గా నిలిచాయి. ఇపుడు ఈ సినిమా కూడా అదే దారిలో హిట్ టాక్ పొందే అవకాశాలు ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. తమిళ్ లో రూపొందిన అరువి లో నటించిన టాలెంటెడ్ హీరోయిన్ అదితి బాలన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
తాప్సి పన్ను హీరోయిన్ గా నటించిన హసీన్ దిల్రుబా కూడా ఈ వారం విడుదలవుతుంది. రొమాంటిక్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందింది. పెళ్ళైన ఒక అమ్మాయి తన ప్రేమికుడి కోసం భర్త ని హత్య చేసింది అన్న కోణం లో ఈ సినిమా రూపొందించారు. మరి భర్త ని హత్య చేసి తెలివిగా తప్పించుకుందా లేక దొరికిపోయిందా లేక వేరే ఎవరైనా హత్య చేశారా అనే థ్రిల్లింగ్ సబ్జెక్టు తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా జులై 2 నుండి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదలవుతుంది.
హాలీవుడ్ మర్వెల్ వారు సినిమాలతో పాటు సిరీస్ లు కూడా మొదలుపెట్టారు. అవెంజర్స్ సిరీస్ లలో కనిపించే లోకి కారెక్టర్ తో సిరీస్ మొదలు పెట్టారు. ఈ మధ్యనే ఈ సిరీస్ ని విడుదల చేసారు. ఈ వారం నుండి ఈ సిరీస్ ని తెలుగు లో డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.
కన్నడ హీరో ధృవ్ సజ్జా హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన సినిమా పొగరు. ఈ సినిమా ఈ ఏడాది మొదట్లో థియేటర్ లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమా అంతగా ఆదరణ నోచుకోకపోవడం తో ఈ సినిమా వచ్చినట్టు కూడా తెలియదు. ఈ సినిమా ఆహా ఓటీటీ వాళ్ళు జులై 2 నుండి తెలుగు వెర్షన్ లో వాళ్ళ ఓటీటీ లో అందుబాటులో ఉంచనున్నారు.