టాలీవుడ్: ఒకప్పుడు థియేటర్లో విడుదలైన సినిమాలు సంవత్సరం తర్వాతనో లేదా కొన్ని నెలల తర్వాతనే టెలివిజన్ లో ప్రసారం అయ్యేవి. కానీ రోజులు మారాయి. ఓటీటీ ల రాకతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాల రిలీస్ చేంజ్ అయింది. సినిమా విడులకి ముందే ఆ సినిమాని ఎప్పుడు ఓటీటీ లో విడుదల చెయ్యాలో ఒక అగ్రిమెంట్ రాసుకుని విడుదల చేస్తున్నారు. కొన్ని హిట్ సినిమాలకి ఐతే తేదీ మార్చకుండా అలాగే ఉంచుతున్నారు కానీ చాలా ప్లాప్ సినిమాలకి చాలా ముందుగా విడుదల చేసేట్టు ప్రొడ్యూసర్స్ కి ముందుగా అనుకున్న దాని కన్నా ఎక్కువ డబ్బులు ముట్టజెప్పి సినిమాని అనుకున్న తేదీ కన్నా ముందుగానే ఓటీటీ లో ఉంచుతున్నారు.
ఈ కోవలో ఈ మధ్య ఓటీటీ లో విడుదలైన గాలి సంపత్, యువరత్న (కన్నడ) సినిమాలు వస్తాయి. ఈ మధ్య విడుదలైన మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీలో ఈ నెలలో రానున్నాయి. మార్చ్ 11 న విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన ‘జాతి రత్నాలు’ సినిమా సరిగ్గా నెల రోజులకి ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి లో విడుదలైన సూపర్ హిట్ సినిమా ‘ఉప్పెన’ ఈ మధ్యనే 50 రోజుల తర్వాత నెట్ ఫ్లిక్ లో అందుబాటులో ఉంచారు. మార్చ్ 26 న యువ నటుడు కార్తికేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా విడుదలైంది. అల్లు అరవింద్ గారి గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అనగానే ఈ సినిమా పై కొంతమంది అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఏప్రిల్ 23 నుండి ఈ సినిమా ఆహ ఓటీటీ లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు.