టాలీవుడ్: RX100 సినిమా ద్వారా మొదటి సినిమానే సూపర్ సక్సెస్ సాధించిన హీరో కార్తికేయ గుమ్మకొండ. ఈ హీరోకి వరుసగా మూడు, నాలుగు ప్లాప్ లు పడ్డాయి. ఆ తర్వాత తీసే సినిమాల్లో కొంచం జాగ్రత్త పడుతున్నాడు. ఇపుడు గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ వారితో ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న సినిమా ‘చావు కబురు చల్లగా’. ఇదివరకే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. GA2 పిక్చర్స్ అన్నా, అల్లు అరవింద్ సినిమా అన్నా కూడా మినియం గ్యారంటీ ఉంటుంది. ప్రస్తుతం కార్తికేయ కూడా ఈ సినిమా కోసం మంచి హోప్ తో ఎదురుచూస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల రాక్షసి ‘లావణ్య త్రిపాఠి‘ నటిస్తుంది. లావణ్య కి సంబందించిన పాత్ర పేరు ‘మల్లిక’ తో పాటు లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది ‘చావు కబురు చల్లగా’ సినిమా టీం. అర్జున్ సురవరం తర్వాత లావణ్య తెరపై కనిపించబోతున్న సినిమా ఇది. కౌశిక్ పెగళ్ళపాటి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాద్వారా పరిచయం అవబోతున్నాడు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా సునీల్ రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు.