fbpx
Wednesday, January 15, 2025
HomeMovie Newsదీపావళి కి పేలనున్న లక్ష్మి బాంబ్

దీపావళి కి పేలనున్న లక్ష్మి బాంబ్

LaxmiBomb OTTStreamingFrom November9th

బాలీవుడ్: సౌత్ లో విడుదలై సక్సెస్ సాధించిన ‘కాంచన’ సినిమాకి రీమేక్ ‘లక్ష్మి బాంబ్’. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని కాంచనకి దర్శకత్వం వహించిన ‘రాఘవ లారెన్స్’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముందే పూర్తి అయినప్పటికీ కరోనా వల్ల విడుదల ఆలస్యం అయింది. అయితే థియేటర్ లు తెరుచుకునే అవకాశం అంతగా కనపడకపోవడం తో ఈ సినిమాని ఓటీటీ ల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. గతంలో విడుదలైన అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

చిత్రం దీపావళి సందర్భం గా నవంబర్ 9 నుండి ఓటీటీల్లో అందుబాటులో ఉండబోతుంది. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో విడుదల కాబోతోంది. అదే రోజు నుండి థియేటర్లలో కూడా విడుదల అవబోతుంది ఈ సినిమా. కానీ అది ఇండియా లో కాదు ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఈ సినిమా అదే రోజున థియేటర్ లలో విడుదల అవబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular