న్యూఢిల్లీ: ఇటీవలే ఎల్‌జీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా తన మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పుడు తాజాగా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా యుఎస్ ఆధారిత సంస్థ అయిన కీసైట్ టెక్నాలజీస్, కొరియా అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్టెక్నాలజీలతో కలిసిన్ పని చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మూడు టెక్నాలజీ సంస్థలు కలిసి 6జీ టెక్నాలజీని వీలైనంత త్వరగా తీసుకొని రావడానికి కావాల్సిన పరిశోధనలపై దృష్టి సారించాయి. ఈ కంపెనీల ఒప్పందం ప్రకారం, 6జీ కమ్యూనికేషన్లకు కీలకమైన ఫ్రీక్వెన్సీ బ్యాండ్ టెరాహెర్ట్జ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఒకదానికొకటి సహకారం అందించుకోనున్నాయి.
వీరు 6జీ పరిశోధనలను 2024 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. 6జీ నెట్‌వర్క్ ను వాణిజ్య పరంగా 2029లో అందుబాటులోకి తీసుకోని రానున్నట్లు ఎల్‌జీ పేర్కొంది. 5జీ అన్ని దేశాలలో అందుబాటులో రాకముందే 6జీ టెక్నాలజీ అభివృద్ధిపై అనేక సంస్థలు దృష్ట్టి సారించాయి.
6జీ డేటా వేగం 5జీ పోలిస్తే అనేక రేట్లు అధికంగా ఉండబోతుందని కంపెనీ తెలిపింది. ఎల్‌జీ 2019లో కైస్ట్ తో కలిసి 6జీ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది. 6జీ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికి కొరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ సైన్స్ తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకుంది.